RR: షాద్‌నగర్ ఆర్టీసీ కండక్టర్ సరిత నిజాయితీకి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన రూ.3 లక్షల నగదును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు దాన్ని భద్రపరిచి జహంగీర్‌కు పూర్తిగా తిరిగి అందించారు. ప్రజా రవాణాలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతను చాటిన సరితను X వేదికగా మంత్రి ప్రభాకర్ అభినందించారు.
తెలంగాణ
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీకి మంత్రి పొన్నం అభినందనలు


