హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

MBNR: ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్డీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై స్వయంగా ఆటో నడిపారు. ర్యాలీ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుండి తెలంగాణ చౌరస్తా వరకు సాగింది.