హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల కబ్జాలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

MNCL: జన్నారం రేండ్లగూడ పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎమ్మార్వో, కలెక్టర్‌కు వినతులు ఇచ్చినా చర్యలు లేవన్నారు. స్పందించిన ఎమ్మెల్యే, ఎమ్మార్వో బక్కయ్యకు ఫోన్ చేసి, కబ్జాలపై తక్షణమే చర్యలు తీసుకుని చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని ఆదేశించారు.