ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో BRS నాయకుడు రఘు మాట్లాడుతూ.. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో మండల BRS నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
తెలంగాణ
'కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు'


