హైదరాబాద్: 28°C
తెలంగాణ

రత్నవరంలో ఘనంగా ముత్యాలమ్మ పండగ

SRPT: నడిగూడెం(M) రత్నవరం గ్రామంలో ముత్యాలమ్మ పండగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పండగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.