పరిగి మండలంలో ఇటీవల కురిసిన సమృద్ధి వర్షాలతో మొక్కజొన్న పంటలు ఎక్కువగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అనుకూల వాతావరణం సకాలంలో వర్షాలు కురవడంతో పంట ఎదుగుదల ఆశ జనకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. పంటకు చీడపీడలు తలగకుండా అధికారులు తగిన సూచన సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
పచ్చని పైర్లతో పరవశించిన పరిగి


