BHPL: రేగొండ మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లు జలమయమయ్యాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో పోలిస్తే ఆదివారం నాటి వర్షం తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. వర్షంతో వాతావరణం చల్లబడగా, ప్రజలు ఉపశమనం పొందారు. రైతులు సైతం ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: రేగొండలో తెల్లవారుజామున భారీ వర్షం


