CTR: గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలోని 72 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. విద్యాశాఖ అధికారులు రూపొందించిన జాబితాకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమోదం తెలిపారు. శనివారం చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఎంపికైన ఉపాధ్యాయులకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయులుగా 72 మంది ఎంపిక


