హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్

CTR: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకమని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, డీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.