హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కృష్ణా: గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు సునీల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను అనుకరిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.