హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

93 ఏళ్ల రిటైర్డ్ హెచ్‌ఎంకు సత్కారం..!

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శ‌నివారం జరిగాయి. ఈ సందర్భంగా 93 ఏళ్ల సీనియర్ ఉపాధ్యాయులు కుప్పిలి ఆనందరావును ఘనంగా సత్కరించడంతో పాటు, పలువురు ప్రొఫెసర్లు, మహిళా టీచర్లను సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు గురువులే నిజమైన పునాది అని డాక్టర్ కందుల కొనియాడారు.