హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్ తో ఇబ్బందులు

ELR: ఉంగుటూరులో యూనియన్ బ్యాంకు ఎదురుగా జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో శనివారం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రద్దీ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ పార్కింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని, నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.