హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రంక్ రోడ్లు, LPS లేఅవుట్లపై ఏడీసీ గ్రాండ్ రివ్యూ

GNTR: అమరావతిలో నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏడీసీ ఎండీ డీ.లక్ష్మీపార్థసారథి ఆదేశించారు. శనివారం ట్రంక్ రోడ్లు, ఎల్‌పీఎస్ (LPS) లేఅవుట్లను పరిశీలించిన ఆమె, ఉండవల్లి, పెనుమాక వద్ద వరద నివారణ పనులను వారంలోగా ముగించాలన్నారు. వీఐపీ మార్గం E-6, N-9 సైక్లింగ్ ట్రాక్‌తో పాటు జోన్-9, జోన్-5సీ అభివృద్ధి పనులను సమీక్షించారు.