హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కార్డుల పంపిణీ

కృష్ణా: కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కార్డులను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్‌పై లీటరుకు రూ.9 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలతో గతంలో సబ్సిడీ నిలిచిపోయిందని అధికారులు వివరించగా, సమస్యలను పరిష్కరించి సబ్సిడీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.