హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు దాటితే యాక్షన్.. ఎస్సై హెచ్చరిక

NDL: వినాయక చవితికి నిబంధనలు పాటిస్తూ.. పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మహానంది పోలీస్ స్టేషన్‌లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.