హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

VZM: అయ్యన్నపేట జంక్షన్‌లోని మదర్ థెరిసా కిడ్స్ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు.