హైదరాబాద్: 28°C
వార్తలు

‘ట్రంప్ కలవాలనుకునే అగ్రనేత మోదీనే’

ఈ ఏడాది డిసెంబర్‌లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సమ్మిట్‌పై భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని కలవడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారని తెలిపారు. ట్రంప్ జాబితాలో మోదీ అగ్రస్థానంలో ఉంటారని చెప్పారు. భారత్‌లో తనకు లభించిన అద్భుత ఆతిథ్యాన్ని ట్రంప్ ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకుంటారని గోర్ పేర్కొన్నారు.