MDCL: కీసరగుట్ట శైవక్షేత్రంలో 'నంది స్తంభాలు'గా పిలిచే స్మారకాల వెనుక ఉన్న చరిత్రను 'కొత్త తెలంగాణ చరిత్ర' బృందం వెలికితీసింది. స్తంభాలపై శిల్పాలు, ఆహార్యం బట్టి ఇవి 14, 15వ శతాబ్దాల నాటివని బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. వీరులు, వారి భార్యల సమాధుల గుర్తుగా వీటిని నిలిపారని, అక్కడ వీరగల్లు, స్త్రీల విగ్రహాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ
వెలుగులోకి శతాబ్దాలనాటి స్మారక స్తంభాలు


