MNCL: చెన్నూరు మండలంలోని తుర్కపల్లికి వెళ్లే ప్రధాన రహదారి ఆధ్వానంగా మారింది. సుద్దాల గ్రామ సమీపం నుంచి తుర్కపల్లి వరకు మట్టి రోడ్డు ఉంది. రహదారి పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే రోడ్డంతా బురదగా మారడంతో నరకయాతన పడుతున్నారు. పాలకులు స్పందించి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలతో రాకపోకలకు ఇబ్బందులు


