BDK: ములకాలపల్లి మండల పరిధిలోని చాపరాలపల్లి రామాలయంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని శుక్రవారం రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, ఆటోలో తరలించేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఇట్టి విషయాన్ని గమనించి నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అన్నపురెడ్డి పోలీస్ స్టేషన్‌లో నిందితులను అప్పగించారు.
తెలంగాణ
హుండీ చోరీకి యత్నం.. నిందితుల అరెస్ట్


