హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం వాయిదా!

నల్గొండ జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు అందించే అవార్డుల ప్రధానోత్సవం వాయిదా పడింది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో సుశీందర్‌రావు తెలిపారు. ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశామని, సన్మాన కార్యక్రమానికి త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని చెప్పారు.