BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం నిత్య కల్యాణం శాస్త్రోక్తంగా సాగింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం మిథిలా స్టేడియంలోని నిత్య కళ్యాణ మండపంలో వేదమంత్రాల నడుమ కన్యాదానం, మాంగల్యధారణ ఘట్టాలు నేత్రపర్వంగా జరిగాయి. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా రాములవారి నిత్య కళ్యాణం


