హైదరాబాద్: 28°C
తెలంగాణ

కత్తులతో దాడి.. గౌతమ్‌ దుర్మరణం!

WGL: ఖిల్లా వరంగల్ మండలం తిమ్మాపురం జాన్సీనగర్‌లో మేకల గౌతమ్ (26) శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన గౌతమ్‌ను ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మామూనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.