హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయాలి'

MLG:సెప్టెంబర్‌ 7న ఏటూరునాగారం ITDA ముట్టడిని జయప్రదం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మహిపతి అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. వెంకటాపురం మండలం రాచపల్లి పంచాయతీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కుల పరిరక్షణ చట్టాలు అమలు చేయాలని, ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.