KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడంతో మెట్టప్రాంత రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మధ్యమానేరు కుడికాలువ ద్వారా నీరందిస్తామన్న హామీలు అమలు కాలేదని వాపోయారు. కాలువల మరమ్మతులు లేక నీరు విడుదల సమయంలో గండ్లు పడుతున్నాయని తెలిపారు. మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని డీఈ జయహారిక తెలిపారు.
తెలంగాణ
గౌరవెల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి: రైతులు


