హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యర్థాలతో కాలనీవాసులకు ఇక్కట్లు

GDWL: అయిజ మున్సిపాలిటీలోని రాయచూర్ రోడ్డుపై ఉన్న ఓ దాబా నుంచి వచ్చే వ్యర్థాలు బుడగ జంగాల కాలనీ మీదుగా వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు తెలిపారు. అధికారులు స్పందించి దాబా యజమానికి కౌన్సెలింగ్ ఇచ్చి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు.