హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్టి కొట్టు విజేతకు రెండు తులాల వెండి బహుమతి

GDWL: అలంపూర్‌లో రాత్రినిన్నకురువ యాదవ సంఘం భవనం వద్ద శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టు ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉట్టి కొట్టు ఉత్సవంలో విజేతగా నిలిచిన ఆకాష్‌ కు రెండు తులాల వెండిని బహుమతిగా అందజేశారు.