హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిటీలో సీతాఫలాల జోరు..!

హైదరాబాద్ నగర శివారుల్లో సీతాఫలాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ వీటిని జోరుగా విక్రయిస్తున్నారు. సీజనల్ పండు కావడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో సీతాఫలాలు రూ. 100 నుంచి రూ. 150 వరకు ధర పలుకుతోంది. అయితే గతంలో పోలిస్తే దిగుబడి తగ్గి డిమాండ్‌కు సరిపడా పంట రావడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.