హైదరాబాద్: 28°C
తెలంగాణ

523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత!

NZB: ధాన్యం మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు, పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నవీపేట మండలం అనంతగిరిలోని ఎస్ఆర్ఎం ట్రేడర్స్‌లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. సోదాలు నిర్వహించి 523 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.