WGL: శ్రావణ మాసం గురువారం సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు,పూజలు నిర్వహించి నూతన వస్త్రాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు..!


