హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

BHNG: పోచంపల్లి మండలం జలాల్‌పూరంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఛైర్మన్ కిషోర్‌ తెలిపారు. 10తరగతి, ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ, వసతి ఉచితమని, శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 16న ధ్రువపత్రాలతో సంస్థకు హాజరుకావలని కోరారు.