SRD: కంది సెంట్రల్ జైలులో ఖైదీలకు అందుతున్న సదుపాయాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలను స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, బాధితులకు ఉచితంగా న్యాయవాదిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
తెలంగాణ
కంది సెంట్రల్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి సౌజన్య


