హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు

SRD: విద్యాభ్యాసానికి దూరమైన వారికి విద్యనందించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ప్రవేశాలు కల్పిస్తోంది. జాయింట్ డైరెక్టర్ రాంజీ సూచనల మేరకు పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు ఈ నెల 15 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు, డ్రాప్ అవుట్స్ వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.