హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ప్రత్యేక దృష్టి

KMR: రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా జుక్కల్ MLA లక్ష్మీకాంతరావు మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులతో బుదవారం కీలక సమీక్ష నిర్వహించారు. లెండి, నాగమడుగు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను విశ్లేషించి, అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు. రైతన్నల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.