హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఊరు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి'

KMR: ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని రామారెడ్డి SI మురళి ఓ ప్రకటనలో సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నందున, ఇంట్లో బంగారం, నగదు ఉంచవద్దన్నారు. ఊరు వెళ్లే ముందు ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తెలపాలని కోరారు.