హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు జల్ జీవన్ మిషన్‌పై మోదీ చర్చ

ఢిల్లీలో ఇవాళ జల్ జీవన్ మిషన్‌పై రెండో రోజు సమీక్షను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. హర్ ఘర్ నల్ జల్ పురోగతిపై సమగ్రంగా చర్చించనున్నారు. క్యాచ్ ది రెయిన్ ఉద్యమం ద్వారా వర్షపు నీటి సేకరించడం, ప్రతి ఇంటికి రోజూ సురక్షిత, తగినంత తాగునీటిని అందించే ప్రణాళికపై మోదీ మాట్లాడనున్నారు.