AP: రొయ్యల మేత ధరలు భారీగా పెరిగాయి. రైతుల ఆమోదం, ప్రభుత్వం అనుమతి లేకుండానే మేత తయారీ సంస్థలు ధరలను భారీగా పెంచాయి. వెనామీ మేతపై కిలోకు రూ.9, టైగర్ మేతపై కిలోకు రూ.12 పెంచారు. పెంచిన ధరలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి. రొయ్యల మేత ధరల పెంపుపై రైతు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడిసరుకు ధరలు పెరగడం వల్ల మేత ధరలు పెంచామని ఫీడ్ కంపెనీలు చెబుతున్నాయి.
వార్తలు
భారీగా పెరిగిన రొయ్యల మేత ధరలు


