హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 110 వినతులు: అ. కలెక్టర్

VKB: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్జీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పింఛన్లు, భూసమస్యలు, ఇందిరమ్మ గృహాలు, పంచాయితీలకు సంబంధించి 110 వినతులు వచ్చాయని తెలిపారు.