హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంలో న్యాయవాదికి సీజేఐ అక్షింతలు

పెళ్లి పేరుతో మోసపోయిన మహిళలకు భార్య హోదాతో పాటు ఆర్థిక రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది N.సుదర్శన్‌రావు పిటిషన్ నిర్లక్ష్యంగా, అపఖ్యాతికరంగా ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు. అసలు దేశంలో పిటిషన్ల రచన ఎలా జరుగుతుందో కోర్టులోని అందరికీ తెలిసేలా.. మీ పిటిషన్ మీరే గట్టిగా చదవాలంటూ ఆయనకు సీజేఐ చురకలంటించారు.