హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మిచేడు జమ్మలమ్మ మూడవ ప్రత్యేక పూజలు

GDWL: గద్వాల జిల్లా జమ్మిచేడులో కొలువైన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి మూడవ శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా నది పవిత్ర జలాలతో అభిషేకం, ఆకుపూజ, హోమం శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు దర్శన సౌకర్యం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.