హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు కలెక్టర్‌కు ఘన సన్మానం

NRML: వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌ను సోమవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. వారికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. నిర్మల్ జిల్లాలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.