హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైళ్ల భద్రతపై SCR అధికారుల కీలక సమీక్ష

HYDలోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. AGM, PHODలతో కలిసి రైళ్ల సురక్షిత నిర్వహణపై చర్చించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ DRMలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని జోన్‌లోని భద్రతా అంశాలను సమీక్షించారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.