హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NRML: జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో కుబీర్ మండలానికి చెందిన నలుగురు మృతి చెందటం, పలువురికి తీవ్ర, స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితులను మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా ప్రభుత్వ, 3 ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.