హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదిర గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ ప్రోగ్రాం

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో సోమవారం కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్సై ఎన్. రమేష్ హాజరై సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, కాల్స్ నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ ఇవ్వవద్దన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.