హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.50 లక్షలతో కంపోస్టింగ్ షెడ్‌కు శంకుస్థాపన

PDPL: పెద్దపల్లి రాఘవపూర్ డంపింగ్ యార్డు వద్ద రూ.50 లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో నిర్మించనున్న డీఆర్‌సీసీ, కంపోస్టింగ్ షెడ్ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. టెండర్లు పూర్తయ్యాయని, ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కమిషనర్, ఛైర్మన్‌కు సూచించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.