హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా

NRML: తానూర్ మండలంలోని ఎల్వి, కోలూర్, తొండాల గ్రామాల్లో ఇటీవల అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.