హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న బియ్యం పంపిణీ గడువు పెంపు

మెదక్ జిల్లాలో పీడీఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీ గడువును ఈనెల 5 వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అవకాశం కల్పించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు సన్న బియ్యం అందుకోని రేషన్ కార్డుదారులు ఈ అదనపు గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.