హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, ర్యాలీలు, భారీగా గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.