NRPT: మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేట వెళ్లాలంటే ప్రయాణికులు సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు సరిపడా లేకపోవడంతో పాటు, అందుబాటులో ఉన్న బస్సుల్లోనూ నిలబడేందుకు స్థలం దొరకడం లేదు. దీంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలను పణంగా పెట్టి ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణిస్తున్నారు. రద్దీ వేళల్లో అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
బస్సుల్లో రద్దీ.. ఫుట్‌బోర్డుపైనే ప్రయాణం


