హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణపూర్‌కు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

GDWL: నారాయణపూర్‌ జలాశయానికి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని జూరాల అధికారులు తెలిపారు. ప్రస్తుతం 492.23 మీటర్లకు చేరింది. జలాశయంలో 33.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నదికి 6 వేలు, కాలువలకు 12 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 18 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.